Magazines

తాడిచెర్ల డేంజర్ జోన్లో చిగురిస్తున్న ఆశలు.!

53 నిమిషాల క్రితం

danger zone of Tadicherla!
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

59 ఎకరాలకు డిక్లరేషన్ జారీ చెసిన కలెక్టర్

నవతెలంగాణ-మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచర్ల ఓపెన్ కాస్ట్ కోల్ బ్లాక్-1కు 500 మీటర్ల డేంజర్ జోన్లో భూ నిర్వాసితులకు ఆశలు చిగురించనున్నాయి.ఏళ్ల తరబడి సాగుతున్న భూసేకరణ ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది.2022 డిసెంబర్ లో 2,600 ఇళ్లు, 231.33 ఎకరాల భూమి సేకర ణ కోసం జారీ చేసిన ప్రైమరీ నోటిఫికేషన్ (పీఎన్) గడువు ఈ డిసెంబర్ 4తో ముగియనుండటంతో జెనోకో, రెవెన్యూ అధికారులు స్పందించారు.సాం కేతిక, చట్టపరమైన చిక్కులు రాకుండా 59.29 పై చిలకు ఎకరాల వ్యవసాయ భూములకు సంబం ధించి ఫారం-7 డిక్లరేషన్ ప్రకటిస్తూ కలెక్టర్ గెజిట్ బుధవారం విడుదల చేశారు.కలెక్టర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో సర్వే నంబర్లు ఇలా ఉన్నాయి.


06, 738, 750, 751, 752, 753, 755, 763, 773, 797, 809, 810, 812, 819, 820, 821, 822, 823, 824, 825 పరిధిలో మొత్తం 59.29 2 సంబంధించి 45 మంది రైతుల పేర్లను చేర్చారు.భూసేకరణ చట్ట ప్రకారం పీఎన్ ఇచ్చిన ఏడాదిలోపు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా,పలు కారణాలతో గడువు పొడిగిస్తూ వచ్చారు. ఈ డిసెంబర్ తో ఆ గడువు ముగుస్తుండటంతో అధికారులు అత్యవసరంగా భూములకు డిక్లరేషన్ పూర్తి చేసి ఊపిరి పీల్చుకున్నారు. వీరికి త్వరలోనే అవార్డు విచారణ నిర్వహించి పరిహారం అందించనున్నారు.


మూడు  నెలలుగా సాగుతున్న ఇళ్ల సర్వే..

మూడు నెలలుగా తాడిచర్ల గ్రామంలోని ఇళ్ల సర్వే ముమ్మరంగా సాగుతోంది.5 సర్వే బృందాలు ప్రతీ ఇంటికి వెళ్లి కొలతలు తీయడం,ఫొటోలు తీయడం,కుటుంబ వివరాలను నమోదు చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి.ఇళ్లకు,భూములకు సంబంధించి 1833 దరఖాస్తులను సమర్పించగా 90 శాతం సర్వే పూర్తి చేశారు.ఎప్పటికప్పడు వివరాలను ట్యాబ్లో నమోదు చేస్తున్నట్లు సర్వే టీం సభ్యులు చెబుతున్నారు.అయితే, సర్వే నత్తననడకన సాగుతుండడంతో గ్రామస్తులు ఆం దోళన చెందుతున్నారు.


భూములకు డిక్లరేషన్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ,ఇళ్ల సర్వేను కూడా త్వరగా పూర్తి చేసి మిగిలిన భూములు, ఇళ్లకు డిక్లరేషన్ విడుదల చేయాలని డేంజర్ జోన్ నిర్వాసితులు కోరుతున్నారు. పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ త్వరితగతిన అందిస్తేనే తాము కొత్త ప్రాంతాల్లో పునరావాసం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నిర్వాసితులు ఆందోళన చెందవద్దు: దండు రమేష్ భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు 

డేంజర్ జోన్లో ఉన్న నిర్వాసితులు ఎవరు  ఆందోళన చెందవద్దు.మంత్రి శ్రీదర్ బాబు సహకారంతో ప్రతి నివాసాన్ని,నివాసంలో ఉన్న ఇంటి స్థలాన్ని ఉన్నతాధికారులచే డిక్లరేషన్ ప్రకటించేలా త్వరలోనే చర్యలు తీసుకుంటారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్