Magazines

ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలపై మంత్రులతో జేఏసీ చర్చలు

25 నిమిషాల క్రితం

JAC holds discussions with
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

సానుకూలంగా స్పందించిన మంత్రులు..
ఉద్యమ కార్యాచరణ యథాతథం

నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. మంగళవారం రాత్రి ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామితో ఓయూ నాన్ టీచింగ్ స్టాఫ్ జేఏసీ నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో టీజీ జేఏసీ నాయకుడు ఎల్లూరి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను, ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలను జేఏసీ నాయకులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యలను పరిశీలించిన మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, ఫైనాన్స్ శాఖకు సంబంధించిన అభ్యంతరాలను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్‌తో చర్చించి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. ముఖ్యంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు ఉద్యోగులకు, జేఏసీ నాయకులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

మంత్రుల సానుకూల స్పందనపై జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఉద్యోగుల సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం లభించే వరకు ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది. ప్రకటించిన ఆందోళన కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని నాయకులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్