Magazines

ప్రతిపక్ష‍ సర్పంచులకు న్యాయం చేయాలి

31 నిమిషాల క్రితం

opposition sarpanches.
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

సర్వసభ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ సర్పంచులు 

నవతెలంగాణ-మిడ్జిల్

అధికారులు, అధికార పార్టీ నాయకులు చెప్పిందే వింటూ ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల సమస్యలు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గురువారం సర్వసభ సమావేశాన్ని బహిష్కరించి ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, చంద్రయ్య గౌడ్, మాట్లాడుతూ.. రెండు గంటలకు సర్వసభ్య సమావేశం అని పిలిచి మూడు గంటలైనా సభ ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు ప్రతిపక్ష పార్టీల సర్పంచులకు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


సర్పంచులు గెలిచి 11 నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీకి కేటాయించలేదనీ, సర్పంచుల జీతాలు ఖాతాల్లో జమచేయట్లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చైర్మన్‌లుగా సర్పంచ్ అని చెప్పి, సర్పంచులకు తెలియకుండానే ఇండ్లు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ప్రతి గ్రామానికి 50 లక్షల వరకు మంజూరు చేస్తామని చెప్పి, ప్రతిపక్ష పార్టీల సర్పంచులు ఉన్న దగ్గర అధికార పార్టీ నాయకులే పనులు ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు. దీనిపై వెంటనే జిల్లా అధికారులు స్పందించి ప్రతిపక్ష సర్పంచులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో

అయ్యవారిపల్లి సర్పంచ్ వెంకట్ రాములు కంచన్ పల్లి సర్పంచ్ మహేశ్వరి మల్లేష్, బైరంపల్లి సర్పంచ్ గోపాల్ ముదిరాజ్, నాయకులు పట్నం బంగారు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్