Magazines

గోవా అంతర్జాతీయ సదస్సుకు మంత్రి తుమ్మల

1 గంట క్రితం

Minister Tummala
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​తెలంగాణ రైతాంగ అభివృద్ధికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న విశేష కృషికి గుర్తింపు లభించింది.

​ఈ నేపథ్యంలో గోవాలో జరగనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాల్సిందిగా మంత్రి తుమ్మలకు ప్రత్యేక ఆహ్వానం అందింది.


​ఈ అంతర్జాతీయ వేడుకకు గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. మంత్రితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సైతం ఈ పర్యటనలో పాలుపంచుకోనున్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు,  అమలు చేస్తున్న నూతన విధానాలపై ఈ వేదికపై చర్చ జరగనుంది.


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నిపుణులు, ప్రముఖులతో మంత్రి తుమ్మల భేటీ కానున్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం చేపట్టిన సంస్కరణలను ఈ సదస్సు ద్వారా ఇతరులకు మంత్రి తుమ్మల వివరించనున్నారు. ఈ పర్యటన ద్వారా వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికతను రాష్ట్రానికి తీసుకువచ్చే విషయాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోవాకు గురువారం రాత్రి బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్