నవతెలంగాణ - భీంగల్
నిజామాబాదు జిల్లాలోని భీంగల్ మండలం జాగీర్యాల హైవే రోడ్డు పక్కన పైప్లైన్లీకై మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నాయి. మూడు రోజులుగా పైప్లైన్ లీకై తాగునీరు రోడ్లపై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీటిఎద్దడి నెలకొన్న విషయం తెలిసినా అధికారులు నిర్లక్ష‍్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఓ వైపు నీరు వృధా చేయొద్దని, పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా.. గత మూడు రోజులుగా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి సమస్య పరిష్కరించి, నీటివృధాను అరికట్టాలని పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)