జిల్లా స్థాయికి ఎంపికైన మల్లారం హైస్కూల్ విద్యార్థులు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు జానపద నృత్యాల మండల స్థాయి నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఐదు హైస్కూల్స్,కేజీబీవీ,ఆదర్శ పాఠశాల నుంచి 8, 9వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు జానపద నృత్యాల పోటీలకు హాజరైయ్యారు.
ఈ మండల స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో మల్లారం హైస్కూల్ విద్యార్థినిలు గెలుపొందారు. ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయిలో ఈ నెల 30న నిర్వహించే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎంఈఓ తెలిపారు. మొదటి స్థానంలో గెలుపొంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన మల్లారం పాఠశాల విద్యార్థులను ఎంఈఓ అభినందించారు. జిల్లా స్థాయిలో కూడా మరింత ఉత్సాహంతో పాల్గొని జిల్లా స్థాయిలో కూడా మొదటి స్థానాన్ని గెలుపొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వల్లెం కుంట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుదర్శనం, తాడిచర్ల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)