నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని మేనూరు గుట్ట ప్రాంతలో పద్మశాలి సంఘం, గౌడ సంఘం, లింగాయత్ సమాజ్, ముదిరాజ్ సమాజ్, కురుమ సమాజ్ తదితర దేవాలయాలకు వెళ్ళే దారి ఏండ్ల తరబడి అంధకారంలోనే ఉంటోంది. గత పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో సర్పంచ్ అశోక్‌పటేల్ సమస్యను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావు దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దేవాలయాల దారి గుండా విద్యుత్ స్థంభాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అందుకు సరిపడా నిధులు మంజూరు చేశారు. తాజాగా విద్యుత్ స్థంభాల ఏర్పాట్లను సర్పంచ్ పరిశీలించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. అడిగిన వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు.







కామెంట్‌లు (0)