Magazines

అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రజా ఉద్యమాలను నిర్మించాలి

1 గంట క్రితం

aspirations
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న

నవతెలంగాణ-నెల్లికుదురు 

అమరుల ఆశయాల సాధన కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మండలం వెంకన్న తెలిపాడు. శుక్రవారం మండలంలోని రావిరాల. ఆలేడు గ్రామాలలో.కామ్రేడ్ సురేష్ అన్న, గణపతి ల స్థూపాల వద్ద  ఘనంగా నివాళులు అర్పించి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను కొనసాగించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడిచినా దేశంలో భూసమస్య పరిష్కారం కాలేదని, పేదల బతుకుల్లో ఆశించిన మార్పు రాలేదని విమర్శించారు. విప్లవ పార్టీల నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలను ఐక్యం చేసి దోపిడీ, పీడన, అసమానతలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని అన్నారు. అమరవీరుల త్యాగాలకు నిజమైన వారసులుగా వారి పోరాట స్ఫూర్తితో సమానత్వ సమాజ స్థాపన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న, జిల్లా నాయకులు చిర్ర యాదన్న, బట్టు చైతన్య, డివిజన్ నాయకులు నక్క యాకన్న, పల్లె రమేష్, గుగులోతు వీరన్న, తారమ్మ, మైబు, వెంకన్న, రమేష్, భూలక్ష్మి, యశోద, యాదమ్మ, సరూప, సరిత, గాద విజయ, చిన్నా, రేణుక, టోనికే వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు..

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్