నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని అజ్జలాపురం, నరసింహపురం గ్రామల మధ్య పూర్తిగా కంకర తేలి,ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారి,నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్న లింకు రోడ్డును బి.టి రోడ్డు గా వేయాలని కోరుతూ అజ్జలాపురం గ్రామానికి చెందిన డాక్టర్ మెగావత్ చందు నాయక్ సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)