Magazines

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

16 నిమిషాల క్రితం

sanitation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

- తన వార్డులో పనులను పర్యవేక్షించిన కౌన్సిలర్ డా. ఉదయ జ్యోతి

నవతెలంగాణ – అశ్వారావుపేట

తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని 14వ వార్డులో కౌన్సిలర్ డా. ఉదయ జ్యోతి స్వయంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.


వార్డులోని ప్రధాన వీధులు, కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ పరిశుభ్రత చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా నిల్వ నీరు, చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వార్డులో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని కౌన్సిలర్ డా. ఉదయ జ్యోతి తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్