Magazines

దేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని జయప్రదం చేయాలి

12 నిమిషాల క్రితం

nationwide
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

- అఖిల భారత ఐక్య రైతు సంఘం డివిజన్ అధ్యక్షుడు నాగిరెడ్డి 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన రైతు వ్యతిరేక చట్టాలను దొడ్డిదారిన మళ్ళీ రుద్దే ప్రయత్నం చేస్తోందని అఖిల భారత ఐక్య రైతు సంఘం డివిజన్ అధ్యక్షుడు ఒగ్గు నాగిరెడ్డి ఆరోపించారు. గత ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని, దీనికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుమేరకు నేడు (గురువారం) దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపును రైతులు, ప్రజలు విజయవంతం చేయాలని నాగిరెడ్డి కోరారు.


  వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని, విద్యుత్ ప్రైవేటీకరణ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని  డిమాండ్ చేశారు. అలాగే  ఎల్ నినో ప్రభావంతో నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు రూ. 50 వేలు, వాణిజ్య పంటలకు రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని, రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. దేశ రైతాంగానికి నష్టం కలిగించే విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడంతో పాటు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 200 రోజుల పని, రోజుకు రూ. 700 కూలీ కల్పించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్