నవతెలంగాణ-మల్హర్ రావు
అంగన్ వాడి కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సమయపాలన పాటిస్తూ ప్రభుత్వం అందించే పోషకాహారాలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తదితర లబ్ధిదారులకు అందజేయాలని అంగన్ వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి సూచించారు. గురువారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని అంగన్ సెంటర్లు 1,2,4,7 లను సందర్షించి, రోజువారి హాజరుశాతం, సరుకుల పంపిణీ రికార్డులను తనిఖీలు చేపట్టారు. కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, ఆయాలు, చిన్నారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)