నిబంధనలు అతిక్రమిస్తే అనర్హులుగా పరిగణింపు
నిర్మాణంలో ఉన్న, కొత్త వాటికి వర్తింపు
నవ తెలంగాణ-మల్హర్ రావు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల స్లాబ్పై ప్రభుత్వం పరిమితిని విధించింది.లబ్ధిదారులపై అదనపు భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంటి నిర్మాణ ప్లింత్ ఏరియాపై 25శాతం గరిష్టంగా స్లాబ్ నిర్మించుకునే అవకాశం కల్పించింది.అంతకు మించి చేపట్టినట్లేతే అనర్హులుగా ప్రకటించి బిల్లుల చెల్లింపులు నిలిపివేయనున్నట్లుగా స్పష్టం చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం స్లాబ్ దశలో ఉన్న వాటితో పాటు కొత్తగా ప్రారంభించ నున్న వాటికి ఈ నిబంధనలు వర్తించనున్నట్లుగా స్పష్టం చేసింది.
ఇదీ పరిస్థితి..
పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశం తో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.సొంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసి నాలుగు విడతల్లో రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అంద జేస్తుంది.చాలా మంది లబ్ధిదారులు తమకు నచ్చినట్లుగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు.ఇంటికి నాలుగు వైపులా స్లాబ్ అదనంగా పెంచుకుంటు న్నారు.ఇప్పటికే నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడం, కూలీల ఖర్చుతో నిర్మాణాలు భారంగా మారగా అదనపు స్లాబ్ నిర్మాణం మరింత భారమ వుతుంది. ఇందుకోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు ఇంటి నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు.దీన్ని గుర్తించిన ప్రభుత్వం స్లాబ్ నిర్మాణంపై పరిమితిని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజా స్లాబ్ నిబంధనలు ఇలా..
ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం ఇంటి ముందు భాగంలో మూడు అడుగుల వరకు నిర్మించు కోవచ్చు. మిగిలిన మూడు వైపులా ఒక్కో అడుగు స్లాబ్ పొడిగింపునకు అవకాశం ఉంది.కిటికీల వద్ద లబ్ధిదారులు స్లాబ్ పెంచకుండా సజ్జలు, జీఐ ఆధారిత షీట్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్థికంగా భారం పడకుండా ఉంటుంది. ప్రస్తుతం స్లాబ్ దశ లో ఉన్న ఇళ్లతో పాటు రెండో విడతలో కొత్తగా ప్రారంభించనున్న వాటికి సైతం ఈ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఇంటి ప్లింత్ ఏరియాపై గరిష్టంగా 25శాతం స్లాబ్ వేసుకోవచ్చు. ఏఈలు క్షేత్రస్థాయికి వెళ్లి లబ్దిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాల స్లాబ్ వాస్తవ పరిస్థితులను తప్పనిస రిగా ప్రత్యేక యాప్లో నమోదు చేయాలని ఆదేశిం చింది. నిబంధనల ప్రకారం ఉంటేనే బిల్లులు చెల్లించనుంది. లేనిపక్షంలో నిలిపివేతతో పాటు అనర్హు లుగా ప్రకటించనున్నట్లుగా స్పష్టం చేసింది.
అవగాహన కల్పిస్తున్నాం..ఏఈ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల స్లాబ్పై పరిమితి విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి.లబ్ధిదారులు అదనపు స్లాబ్ పెం చుకుని అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తు న్నాం. నిబంధనల మేరకు స్లాబ్ నిర్మించు కోవాలి. లేనిపక్షంలో బిల్లలు నిలిచిపోయే అవకాశముంది.
మండలంలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు..
మంజూరైనవి 328,పూర్తయినవి 31,ఇంకా ప్రారంభం కానివి 50,పునాదులకే పరిమితమైనవి 50,బేస్మెంట్ స్థాయిలోనివి 102,స్లాబ్ దశలో ఉన్నవి 48,స్లాబ్ పూర్తయినవి 50.






కామెంట్లు (0)