Magazines

10 కోట్ల బ్యారల్స్‌ చమురు, డీజిల్‌ను విడుదల చేస్తాం : జీ-7

47 నిమిషాల క్రితం

డీజిల్‌ ధరలు
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఇంధన సరఫరాల్లో నెలకొన్న అవరోధాల కారణంగా చమురు, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 10కోట్ల బ్యా రల్స్‌ చమురు, డీజిల్‌ను విడుదల చేస్తానని జీ-7 ప్రకటించింది. రాబోయే ఇరవై రోజుల్లో డీజిల్‌ను గణనీయంగా విడుదల చేస్తామని, అవసరమైతే అదనపు డీజిల్‌ విడుదలపైనా చర్చలు జరుపుతామని తెలిపింది. ఇది వెంటనే ప్రారంభమై 4నెలల పాటు కొనసాగుతుందని చెప్పింది. డీజిల్‌ ఎగుమతులను నిషేధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో జి-7 సభ్యదేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీని ప్రకారం సభ్యదేశాల మధ్య ఇంధనం, ఇంధన ఉత్పత్తులపై ఎలాంటి ఎగుమతి ఆంక్షలు ఉండవు. జీ-7లో అమెరికా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశా లున్నాయి. వీటి సమావేశాల్లో యూరోపియన్‌ యూనియన్‌ కూడా భాగస్వామి అవుతోంది. ఈయూ దేశాలు తమ వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌లోకి అధికంగా విడుదల చేసేందుకు అంగీకరించకపోతే అమెరికా నుంచి డీజిల్‌ ఎగుమతులను నిషేధిస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. వచ్చే నెలలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నందున ట్రంప్‌ నిర్ణయంతో అ దేశానికి చెందిన వినియోగదారులపై ధరల ఒత్తిడి తగ్గినప్పటికీ ఇతర ప్రాంతాలలో ధరలు పెరుగుతాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్