వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా స్వల్పకాలిక, తక్కువ నీటి వినియోగం ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి రబీ (యాసంగి) 2026-27 కార్యాచరణ ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలతో పాటు అధిక ఆదాయాన్నిచ్చే కూరగాయల పంటల సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలనీ, పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన అంశాలను క్రోడీకరించి, రబీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఉద్యానవన శాఖ సంచాలకులు డాక్టర్ యాస్మీన్ బాషా, వాతావరణ, ఐఐఎమ్‌ఆర్, ఐఐఓఆర్, ఐఐఆర్‌ఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల కొరత రాకుండా చూడండి
హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌లో ఎరువుల కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్‌కు సరిపడా ఎరువుల సరఫరా, ప్రస్తుత నిల్వల స్థితిగతులపై సమీక్షించి, రాబోయే సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సురేంద్రమోహన్ సూచించారు.
రబీలో స్వల్పకాలిక పంటల సాగు ప్రోత్సహించండి
44 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)