Magazines

కేంద్రంపై ​పంట నష్టం ఒత్తిడి తేవాలి

43 నిమిషాల క్రితం

Pressure must be exerted on the Centre regarding crop loss.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

రైతు సమస్యలపై ‌ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలి
అఖిల భారత కిసాన్‌ సభ మహాసభలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ : జూలకంటి, పోతినేని, సాగర్‌​
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, పంటనష్టంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని అఖిల భారత కిసాన్‌ సభ 36వ మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు పోతినేని సుదర్శన్‌, టి.సాగర్‌‌తో కలిసి జూలకంటి మాట్లాడారు. నవంబర్‌ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో జరిగే మహాసభలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించబోతున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విద్యుత్‌ కోతలు, సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బృందాలను రాష్ట్రానికి రప్పించి కరువు పరిస్థితులు, పంట నష్టాన్ని పరిశీలించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. 15న లక్ష మందితో బహిరంగ సభ ​జాతీయ మహాసభలో వ్యవసాయరంగ పరిరక్షణ కోసం భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ తెలిపారు. నవంబర్‌15న లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. నాలుగు రోజులపాటు జరిగే మహాసభకు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడిం చారు.​ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. ​విద్యుత్‌, నీరు, విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు తదితర రంగాలను ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను రైతాంగం వ్యతిరేకిస్తోందన్నారు.
రైతాంగ సమస్యలపై సమగ్ర చర్చ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ మహాసభలో సమగ్రంగా చర్చించి, భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను రూపొందిం చనున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ తెలిపారు. ​కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి అనుకూలంగా ఉన్న విధానాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. దిగుమతులతో దేశీయ రైతులకు నష్టం జరుగుతోం దని, దిగుమతి సుంకాల తగ్గింపుతో వేరుశనగ, నువ్వులు, కుసుమ తదితర పంటలు పండించే రైతులు నష్టపోతున్నారన్నారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో రైతులకు మద్దతు ధర లభించని పరిస్థితి ఏర్పడిందన్నారు. ​ ​తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న పేద, మధ్యతరగతి రైతుల భూముల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు నారి ఐలయ్య, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, ఎండి హశం, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్