Magazines

ప్రేక్ష‍కుల గుండెను తాకేలా..

1 గంట క్రితం

audience
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ‘సమ్మర్ హాలిడేస్’ అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీకర్ దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం హీరో శ్రీవిష్ణు అతిథిగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌ వేడుకను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ,‘ ట్రైలర్ చూసిన ప్పుడు మీకు కలిగిన అనుభూతే సినిమా చూస్తున్నప్పుడు కూడా కలుగు తుంది. మా ప్రొడ్యూసర్ ధీరజ్ ప్యాషన్ వల్లే మా సినిమా ఇక్కడి దాకా వచ్చింది.


థియేటర్స్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడి గుండెను తాకేలా ఉంటుంది. కొన్నేళ్ల పాటు మా సినిమా గురించి మాట్లాడు కుంటారు’ అని తెలిపారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, ‘చిన్నపిల్లల సినిమా ఎందుకు చేస్తున్నావని, థియేటర్స్ కు జనం వస్తారా అని మిత్రులు అంటున్నారు. ఇలాంటి సినిమా హిట్ అయితే వందమంది శ్రీకర్ లు ఇండస్ట్రీకి వస్తారు. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా’ అని అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లా డుతూ, ‘ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు నేను చిన్నప్పుడు సెలవుల్లో ఊరెళ్లిన మెమొరీస్ గుర్తుకువచ్చాయి. ఈ దీపావళి పండక్కి మీరంతా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి’ అని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్