ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైన పరమ పావన శ్రీల ప్రభుపాదుల జీవితం, వారసత్వాన్ని వెండితెరపై ‘శరణాగతి’గా ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అత్యాధునిక ఏఐ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న యానిమేషన్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ వ్యవస్థాపక ఆచార్యులు హిస్ డివైన్ గ్రేస్ ఏ.సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల అసాధారణ జీవితం, ఆధ్యాత్మిక సేవా ప్రస్థానానికి ఘనమైన నివాళిగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ ప్రకటించాయి. ఈ చిత్రానికి గౌర శక్తి దాస రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ సింగ్, లోహిత్ రావు నిర్మాతలు. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.






కామెంట్‌లు (0)