Magazines

డేగ

1 గంట క్రితం

Eagle
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

పనికి తగ్గ వేతనం వ(ఇ)స్తున్నా..

నిజాయితీకి సమాధి కట్టి

లంచాల సంచీలో లాభాలు

నింపుతుంది

సంతకానికి వేలం వేసి

అక్రమార్జనలో

రాజ్యమేలుతుంది

ప్రజల అవసరాలే

అవకాశాల మెట్లు

అధికార పీఠమెక్కి విర్రవీగుతోంది

విచ్చలవిడిగా వ్యాపించే

అవినీతి డేగరెక్కల్ని కత్తిరించే

వజ్రాయుధంలాంటి వ్యవస్థ కావాలిప్పుడు..

సుభాషిణి వడ్డెబోయిన


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్