Magazines

భూకంపం వస్తే..?

44 నిమిషాల క్రితం

earthquake
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం


ముంబయి - అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు కారిడార్‌’ పొడవు 508 కిలోమీటర్లు. అయితే ఈ మార్గంలో రైలు గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ప్రణాళిక రూపొందించారు. ఈ కారిడార్‌ డిజైన్‌ అసలు వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఇంతటి వేగంతో రైలు ప్రయాణిస్తున్నపుడు భూకంపం వస్తే ఏం జరుగుతుంది? రైలు వేగాన్ని ఎలా నియంత్రిస్తారు? ప్రయాణికుల భద్రత మాటేంటి? ఇలాంటి సందేహాలు చాలా వస్తుంటాయి కదా! ‘ముంబయి - అహ్మదాబాద్‌’ మధ్య బుల్లెట్ రైళ్లు నడపనుండగా వచ్చే ఏడాది ఆగస్టు 15న బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో భాగంగా ‘సూరత్‌-వాపి’ మధ్య 97 కిలోమీటర్ల మార్గంలో బుల్లెట్‌ రైలు ప్రయాణించనుంది. దాదాపు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ రైలు వెళ్తున్నపుడు అకస్మాత్తుగా భూకంపం వస్తే ఏం జరుగుతుంది? రైలు పట్టాలు తప్పుతుందా? ప్రయాణికుల భద్రత ఎలా? అనే విషయమై ప్రత్యేక భూకంప పర్యవేక్షణ వ్యవస్థ సమాధానం ఇవ్వనుంది. హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులో భాగంగా 508 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్‌ రైలు కారిడార్‌లో 28 సైస్మోమీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థ భూ అంతర్భాగంలో ప్రకంపనలు మొదలైన వెంటనే గుర్తించి, సెకన్ల వ్యవధిలోనే రైలు భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. భూకంపాలు భూమి లోపల సంభవిస్తాయి. ఆ తరంగాలు భూ ఉపరితలంపై విధ్వంసం సృష్టిస్తాయి. ప్రకంపనలు ప్రారంభం కాగానే ముందుగా సైస్మోమీటర్లు గుర్తించి ఆ సమాచారాన్ని రైలు నియంత్రణ వ్యవస్థకు అందిస్తాయి. దీంతో రైలు వేగం తగ్గించడం లేదా నిలిపేయడం వంటి చర్యలు ఆటోమేటిక్​గా జరిగిపోతాయి. అత్యంత వేగంతో ప్రయాణించే రైలు కావడంతో సాధారణ రైలుతో పోలిస్తే భద్రతా ప్రమాణాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రకంపనలను గుర్తించడం మొదలుకుని రైలు నియంత్రణ వ్యవస్థకు సమాచారాన్ని శరవేగంగా అందించేలా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు కారిడార్‌ పొడవు 508 కిలోమీటర్లు కాగా, రైలు గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ప్రణాళిక రూపొందించారు. ఈ కారిడార్‌ డిజైన్‌ వాస్తవ వేగం గంటకు 350 కిలోమీటర్లు. భారత్‌లో తొలి బుల్లెట్‌ రైలుకు బీ28గా పేరు పెట్టారు. ప్రాజెక్టు పురోగతిలో ఈ రైలు సెట్‌ తయారీ, పరీక్షలు, సంబంధిత మౌలిక వసతుల పనులు కీలకం కానున్నాయి. కారిడార్‌లో స్టేషన్ల నిర్మాణంతో పాటు ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ పరికరాలు, సొరంగాలు, ట్రాక్ సహా పలు ఏర్పాట్లు జరుగుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్