Magazines

నగర రవాణా భవిష్యత్‌కు కొత్త దిశ

1 గంట క్రితం

A New Direction for the Future of Urban Transport
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవంబర్ 26 నుంచి 28 వరకు 
టీ-హబ్‌లో ప్రత్యేక ప్రదర్శన : సీఎంసీ 
కమిషనర్‌ ‌సృజన, సైబరాబాద్‌ ‌సీపీ రమేష్‌

‘సైబరాబాద్ మూవ్స్ - 2026’ పోస్టర్ ఆవిష్కరణ

నవతెలంగాణ-శేరిలింగంపల్లి

వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘సైబరాబాద్ మూవ్స్-2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీఎంసీ కమిషనర్‌ ‌సృజన, సైబరాబాద్‌ ‌సీపీ రమేష్‌ ‌తెలిపారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, షిఫ్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఇనిషియేటివ్ సంయుక్తంగా నవంబర్ 26 నుంచి 28 వరకు సైబరాబాద్‌లోని టీ-హబ్‌లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎంసీ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘సైబరాబాద్ మూవ్స్ - 2026’ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నగర విస్తరణకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, సమర్థవంతమైన రవాణా సౌకర్యాలు కల్పించడం అవసరమన్నారు. రహదారి భద్రతపై అవగాహన, బాధ్యతాయుతమైన ప్రయాణం, వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో మెరుగైన రవాణా వ్యవస్థ సాధ్యమవుతుందని తెలిపారు. నగరాభివృద్ధికి అనుగుణంగా సురక్షితమైన, అందుబాటులో ఉండే, పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జంక్షన్ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో భారీ మ్యాప్‌లు, డేటా విజువలైజేషన్లు, ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్ల ద్వారా నగర రవాణా వ్యవస్థ, ట్రాఫిక్ పీసీ ప్రభుత్వ విభాగాలు కలిసి ఆలోచనలు పంచుకునేందుకు ఈ కార్యక్రమం వేదిక కానుందని తెలిపారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్