Magazines

మెదక్‌ జిల్లాలో దళితులపై దాడులు అమానుషం

1 గంట క్రితం

Attacks on Dalits in Medak district are inhumane.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 
పటిష్టంగా అమలు చేయాలి

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 
ఎస్‌ఐపై చర్య తీసుకోవాలి : కేవీపీఎస్‌ 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు

‌విచారణ జరిపిస్తాం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ 
డిప్యుటీ డైరెక్టర్ రమాదేవి హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మెదక్ జిల్లాలో దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, దాడులను అరికట్టెందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దాడులు జరిగిన కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ డిప్యుటీ డైరెక్టర్ రమాదేవికి కేవీపీఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, రాష్ట్ర నాయకులు ఎం అడివయ్య, కె మల్లేశం, నర్సిములు, దేవయ్య, నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్కైలాబ్, అడివయ్య మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా దళితులపై ఆరు గ్రామాల్లో దాడులు, ఒక గ్రామంలో సాంఘిక బహిష్కరణ జరిగిందని తెలిపారు.

మనోహరాబాద్ మండలం పీటీ కోనాయిపల్లిలో డప్పులు కొట్టేందుకు కనీస వేతనం ఇవ్వాలని అడిగినందుకు గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్, అతని అనుచరులు సుమారు 30 మంది దళితులను కులం పేరుతో దుశిస్తూ, దాడి చేశారు పేర్కొన్నారు. దాడిలో 15 మంది మహిళలు, పురుషులకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యం వహించిన మనోహరాబాద్, శివ్వంపేట ఎస్‌ఐలను సస్పెండ్ చేయాలనీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ అధికారిగా ఉన్న తుప్రాన్ డిఎస్‌‌పీ విచారణలో బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన నిలబడడం అనేక అనుమానలకు తవిస్తుందని తెలిపారు. నిందితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. దళితులపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

​




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్