Magazines

రూ.వెయ్యి కోట్ల ఎస్సీల భూమి కబ్జాకు 
కాంగ్రెస్‌ ఎంపీ యత్నం

19 నిమిషాల క్రితం

బొల్లె జగదీశ్వర్‌హైదరాబాద్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

బొల్లె జగదీశ్వర్‌హైదరాబాద్ నడిబొడ్డున శేరిలింగంపల్లిలో ఎస్సీలకు చెందిన 4.13 ఎకరాల భూమిని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌‌కుమార్‌ ఆరోపించారు. ఈ కబ్జాకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ప్రవీణ్‌కుమార్‌ ‌మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ భూమికి రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భూమి ఎస్సీ గురుకుల విద్యార్థులదని అన్నారు. ఎంపీ బలరాం నాయక్, ఆయన కుమారుడు కలిసి భూమి కబ్జా చేయాలని చూస్తూ, పేదలతో అక్రమంగా గుడిసెలు వేయిస్తున్నారని చెప్పారు. శేరిలింగంపల్లి తహశీల్దార్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సంక్షేమ శాఖ అధికారులు ఆ భూమిలో ఎందుకు బోడ్డు పెట్టడం లేదన్నారు. 15 రోజుల్లో భూమి స్వాధీనం చేసుకోవాలనీ, సాంఘీక సంక్షేమ శాఖకు అప్పగించాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే వేలాది మందితో ఆ భూమి దగ్గరికి వెళ్లి తామే కాపాడుకుంటామనీ, సంక్షేమ భవన్‌‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్