Magazines

జీపీలకు ఐదేండ్ల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక

1 గంట క్రితం

ఉత్తర్వులు జారీ చేసిన 
రాష్ర్ట ప్రభుత్వం
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

పనుల పురోగతిపై 
నిరంతర పర్యవేక్షణ

సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు

ఉత్తర్వులు జారీ చేసిన 
రాష్ర్ట ప్రభుత్వం

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ర్టంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక-2026 (జీపీఎస్‌ఏపీ) ను సిద్ధం చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ ‌శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఏడాదికి ప్రత్యేక వార్షిక కార్యాచరణతో పాటు మూడు నుంచి ఐదేండ్లకు అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించిన సమగ్ర డాటాను రూపొందిస్తారు. జనాభా, పశువులు, పంటలు, నిరుద్యోగుల గణన, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు మొదలైన వాటికి సంబంధించిన రికార్డులను నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ స్థాయిలో అందుబాటులో ఉన్న వివిధ నిధులను ఏకీకృతం చేస్తూ గ్రామ పంచాయతీలు ప్రణాళికలను సిద్ధం చేస్తాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 43 ప్రకారం పంచాయతీ కార్యదర్శి నెలవారీగా గ్రామ గణాంకాలను సేకరిస్తారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా, ఆర్థిక సంఘం నిధుల కింద ఏటా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో వ్యవసాయం, పశుసంపద విస్తరణ, అటవీ జీవనోపాధులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. జీపీఎస్‌ఏపీ డేటా ఎంట్రీకి సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులే పూర్తి బాధ్యత వహిస్తారు. అన్ని రికార్డులను కంప్యూటరీకరించి నెలవారీగా ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌‌లోడ్‌ ‌చేస్తారు. జీపీఎస్‌ఏపీ-2026 రూపకల్పనలో జీపీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అధికారులందరూ బాధ్యత వహించాలి. సమాచారం ఇవ్వని లేదా తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్