Magazines

డిసెంబర్‌ 15 నుంచి ఆశావర్కర్ల నిరవధిక సమ్మె

1 గంట క్రితం

Indefinite strike by ASHA workers from December 15
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

సమస్యల సాధన కోసం దశల వారీ పోరాటానికి సన్నద్ధం

ఆశాల సమస్యల సాధన కమిటీ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సదస్సు

మద్దతు ప్రకటించిన సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఆర్‌‌టీయూ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని తీర్మానించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆశాల సమస్యల సాధన కమిటీ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఆశా యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. నీలాదేవి, బీఆర్‌‌టీయూకు చెందిన ఆశా యూనియన్‌ అధ్యక్షులు ఆర్. సంతోష, ఏఐటీయూసీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కవిత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆశ వర్కర్స్‌ ‌యూనియన్‌(‌సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి జయలక్ష్మి తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజనేయులు, బీఆర్‌‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్‌ ‌మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామీణ, పట్టణ ఆరోగ్య వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అదే సమయంలో వారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పరిష్కరించా లని ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమ ర్శించారు.గత 20 ఏండ్లుగా రాష్ట్రంలో 28 వేల మంది ఆశా వర్కర్లు బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలుగా ప్రజలకు సేవలు అందిస్తు న్నారని గుర్తుచేశారు. ​ఉదయం నుండి రాత్రి వరకు ఫీల్డ్ వర్క్, ఆన్‌లైన్ సర్వేలు, టార్గెట్లు, డ్యూటీలు చేస్తున్నప్పటికీ కేవలం రూ.9,900 లు మాత్రమే పారితోషికం ఇస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఇతర సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ​గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యా యని, హామీల అమలు కోసం కోరితే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివ రించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు.

ప్రధాన డిమాండ్లు

ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.

​పీఎఫ్ , ఈఎస్ఐ (ఈఎస్‌ఐ) సౌకర్యం కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి.

​​భవిష్యత్ కార్యాచరణ

డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని రాష్ట్ర సదస్సు నిర్ణయించింది.

వచ్చే నెల 3న 'ఆశా డే' సందర్భంగా పీహెచ్‌సీ అధికారులకు సమ్మె నోటీస్ అందజేయాలి.

పదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు సమ్మె వినతిపత్రం ఇవ్వాలి.

15 వరకు అన్ని జిల్లాల్లో జిల్లా సదస్సులు నిర్వహించాలి.

16న కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి అధికారులకు సమ్మె నోటీస్ ఇవ్వాలి.

20న మంత్రులకు సమ్మె వినతిపత్రాలివ్వాలి

​డిసెంబర్ 5 నుండి 10 వరకు అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సమ్మె వినతిపత్రాలు ఇవ్వాలి.

​మండలాల్లో ఎంఆర్ఓలకు సమ్మె నోటీస్ అందజేయాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్