Magazines

‘సీఐటీయూ’చలో ఢిల్లీ జయప్రదం చేయండి

59 నిమిషాల క్రితం

Chalo Delhi
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపు
రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా డి. జగదీష్

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 1,2,3 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. ‌గురువారం సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశాన్ని సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించి, కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కాగా, ఈ సమావేశంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నూతన కార్యదర్శిగా డి. జగదీష్‌‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.మల్లికార్జున్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.కవిత, జిల్లా అధ్యక్షులు జే.రుద్రకుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డి. కిషన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్