నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ప్రెస్‌మీట్‌లో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ
స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి : సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక హక్కుల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మికులు దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ వాటి స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్స్ అమలుతో కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం తదితర రంగాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది స్కీమ్ వర్కర్ల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని సింధు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు గ్రాట్యుటీ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా శాశ్వత ఉద్యోగాలను సైతం కాంట్రాక్ట్, నిర్ణీత కాల ఉద్యోగాలుగా మార్చుతున్నారని విమర్శించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను అప్పగించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు.
కార్మిక సంఘాల ఐక్య పోరాటం
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వల్ల గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకా శాలు తగ్గి పట్టణాలకు వలసలు పెరుగుతున్నా యని సింధు తెలిపారు. కార్మిక సంఘాల హక్కు లను కాపాడటంతో పాటు ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరారు. చలో ఢిల్లీ కార్యక్రమా నికి సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయని చెప్పారు.
హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
దేశవ్యాప్తంగా కార్మికవర్గం తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా కదులుతోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలో జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమం లో పాల్గొనాలని పిలుపుని చ్చారు. అనంతరం చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. సమా వేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.వెంకటేష్, ఈశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, శ్రీకాంత్, యాట సోమన్న, నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, చినపాక లక్ష్మీనారాయణ, లకపాక రాజు, దండంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, యంగ్ వర్కర్స్ జిల్లా కో కన్వీనర్ భీమగాని గణేష్ పాల్గొన్నారు.
కార్మికుల శ్రమ దోపిడీ: చుక్కా రాములు
కార్మికుల శ్రమను కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలు దోచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విమర్శించారు. కార్మికుల ఉద్యోగ భద్రతను దెబ్బతీసే నియామక విధానాలను వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అసంఘటిత, స్కీమ్, భవన నిర్మాణ రంగ కార్మికు లను సమీకరించి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు.






కామెంట్‌లు (0)