Magazines

అక్షరమే ఆయుధంగా సుభాష్ జీవితం

11 నిమిషాల క్రితం

Subhash’s life, with the written word as his weapon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

సంస్మరణ సభలో వక్తలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అక్షరాన్ని ఆయుధంగా ప్రయోగించి జనాన్ని మేల్కొల్పడానికి సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ జీవితాంతం కృషి చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత, సిద్ధాంతి సుభాష్ చంద్రబోస్ సంస్మరణ సభ, కాకర్ల సజయ, విజయ కందుకూరి, ఇండస్ మార్టిన్, దీప్తి , విజయ్ కుమార్ తదితరుల నేతృత్వంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ప్రముఖ పాత్రికేయులు కే శ్రీనివాస్, ఆచార్య సూరేపల్లి సుజాత, ఆచార్య జయధీర్ తిరుమలరావు తదితరులు మాట్లాడుతూ, రాసిన దానికి జీవించిన దానికి, సామీప్యం కలిగిస్తూ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్ని కొనసాగించారని, రచనను పీడితుల విముక్తికి ఆయుధంగా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధార్ధిని స్మరిస్తూ అనేకమంది రాసిన స్మారక వాక్యాల సంకలనాన్ని ఒంగోలుకు చెందిన డాక్టర్ నూకతోటి రవికుమార్ వెలువరించగా సంస్మరణ సభలో సన్నిహిత కేర్ హోమ్ పిల్లలతో కలిసి పర్స్పెక్టివ్స్ ఆర్కే, ప్రముఖ మానవ హక్కుల ఉపన్యాసకులు ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ఆవిష్కరించారు. రచయిత ఇండస్ మార్టిన్ , పసునూరి రవీందర్ సుభాష్ పై రాసిన గేయాలను ఆలపించగా జాన్ కందుల లైవ్ సంగీతాన్ని అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు రచయితలు, కవులు సాహిత్యకారులు ఉద్యమకారులు, సామాజికవేత్తలు పాల్గొని ప్రసంగించిన ఈ సభలో సుభాష్ వాక్యాలను పోస్టర్లుగా ప్రకటించారు. ప్రజా రచయిత సిద్దార్ధి సుభాస్ చంద్రబోస్‌‌కు జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు, సామాజిక ఉద్యమ కారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్