Magazines

రైతు పోరాటాలకు కార్మిక వర్గం మద్దతు

19 నిమిషాల క్రితం

Working class supports farmers' struggles
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

రైతు సంఘం జాతీయ మహాసభను

జయప్రదం చేయాలి : సీఐటీయూ

రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి,

జిల్లా కార్యదర్శి ఎమ్‌డీ సలీం

క్లాక్‌‌టవర్‌ సెంటర్‌లో కార్మికుల మానవహారం

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్‌ సభ 36వ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎమ్‌డీ సలీం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. రైతాంగ పోరాటాలకు కార్మిక వర్గం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణ ఎగుమతి, దిగుమతి హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం క్లాక్‌‌టవర్‌ ‌సెంటర్‌‌లో మానవహారం నిర్వహించి రైతు మహాసభకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీర తెలంగాణ సా యుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నల్లగొండ జిల్లా కేంద్రంలో జాతీయ రైతు మహాసభ నిర్వహించడం అభినందనీయ మన్నారు.​ కార్మిక, కర్షక ఐక్యతతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై నికరమైన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక ఐక్య పోరాటాలు నిర్వహించినట్టు గుర్తు చేశారు. నల్లగొండకు విచ్చేస్తున్న జాతీయ నాయకులకు స్వాగతం పలు కుతూ ఈ పుల 15న జరిగే బహిరంగ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ​ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హశం, జిల్లా ఉపాధ్యక్షులు లకపాక రాజు, దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్‌ అవుట రవీందర్‌, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, నల్లగొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు అవురేశు మారయ్య, కార్యదర్శి లక్ష్మీపతి, మాజీ కార్యదర్శులు వీరయ్య, రవి, సభ్యులు అంజయ్య, దూదిమెట్ల వెంకన్న, జగదీష్‌, నాగరాజు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్