Magazines

నిర్బంధంలో ఢిల్లీ

1 గంట క్రితం

Delhi under lockdown
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

ఢిల్లీలో భద్రతా ఆంక్షలపై జాన్ బ్రిట్టాస్ ఆగ్రహం
నవతెలంగాణ - హైదరాబాద్‌: జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేయడంపై సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలో పోలీసుల ఆంక్షలు, భద్రతా సిబ్బంది ఆంక్షల కారణంగా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. “ఇది దిగ్బంధనం కాదు.. నగరంపై ముట్టడి చేసినట్లుంది. నగరం మొత్తాన్ని అమిత్ షా తన ఆధీనంలోకి తీసుకున్నారు.


నా లాంటి ఎంపీ కూడా ఢిల్లీ వీధుల్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. కనీసం ఆరు చోట్ల నన్ను అడ్డుకున్నారు. నా గుర్తింపు కార్డులు చూపించినప్పటికీ ఈ పరిస్థితి ఎదురైంది. ఇదేనా ప్రజాస్వామ్యం? అసలు ఏం జరుగుతోంది?” అని జాన్ బ్రిట్టాస్ ప్రశ్నించారు. యుద్ధాన్ని ఎదుర్కొంటున్న దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని తాను భావించలేదని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనలను అడ్డుకునేందుకు ఇలాంటి నిర్బంధ చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య హక్కులను ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇదే తరహా అణచివేత చర్యలను కొనసాగిస్తే, ప్రస్తుత ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చి ప్రభుత్వాన్ని చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టే ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు.







ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్