నవతెలంగాణ-హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు.
ప్రయివేట్ ట్రావెల్స్ వాహనాల ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగిందని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ. 25 లక్షలు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మరో రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు , ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే పూర్తిగా భరించాలని కోరారు.





కామెంట్‌లు (0)