Magazines

రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్

6 గంటల క్రితం

Team India
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలకు గాను 5వికెట్లు కోల్పోయి 249పరుగులు చేసింది. టాస్ గెలిచిన వెస్టిండిస్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్లు సంజు, అభిషేక్ ధనాధన్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సంజు 22 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 20 పరుగులు చేసి అభిషేక్ ఔట్ కాగా, క్రీజులోకి వచ్చిన ఇషాన్ అదే జోరును కొనసాగించాడు. అభిషేక్ శర్మ(20), ఇషాన్(43), సంజు(82) పరుగులు చేశారు. ఆఖరు ఓవర్లో 18 బంతుల్లో కెప్టెన్ శ్రేయస్స్ 40, 17 బంతుల్లో తిలక్ వర్మ 44 రన్స్ తో విజృంభించారు. వెస్టిండీస్ బౌలర్లు రోస్టన్ చేజ్ మూడు వికెట్లు పడగొట్టగా, షామర్ స్ప్రింగర్ రెండు వికెట్లు తీశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్