:నవతెలంగాణ-హైదారాబాద్: మరోసారి వెస్ట్ండీస్ జట్టు రెచ్చిపోయింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న నాల్గో టీ20లో భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలకు గాను కేవలం మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. కెప్టెన్ హోప్ సెంచరీతో కదంతొక్కాడు. మొదట టాస్ గెలిచిన ఇండియా..కరేబియన్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వెస్ట్ండీస్ ఓపెనర్లు హోప్, అండ్రవ్ అదరగొట్టారు. 16 బంతుల్లో 21 పరుగులతో అడ్రవ్ రాణించారు. మంచి ఊపులో ఉన్న అడ్రవ్ ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ఈ తర్వాత క్రీజులోకి వచ్చిన హిట్ మేయర్ కేవలం 12 బంతుల్లో 33 రన్స్ చేశారు. జోరుమీదున్న హిట్ మేయర్ ను ప్రిన్స్ యాదవ్ పెవిలియన్ పంపాడు.
వీరిద్దరు ఔటైనా వెస్ట్ండీస్ కెప్టెన్ హోప్(102) తన జోరును తగ్గించలేదు. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా..తన ధనాధన్ బ్యాటింగ్ తో భారత్ బౌలర్ల పై ఆధిపత్యం చెలాయించాడు. అతనికి అండగా రూథర్ పర్డ్ నిలిచాడు. రూథర్ పర్డ్ 26 బంతుల్లో 49 రన్స్ చేశాడు. వీరువురు కలిసి బ్యాటింగ్ లో వేగం పెంచి భారీ స్కోర్ కు బాటలు వేశారు. దీంతో ఉప్పల్ వేదికగా వెస్టిండీస్ మరోసారి 247 పరుగుల మార్క్ ను దాటింది. భారత్ బౌలర్లు ఆర్షదీప్, యాదవ్, అక్షర్ పటేల్ తలా వికెట్ తీశారు.






కామెంట్లు (0)