Magazines

కాంగోలో ఎబోలా వైరస్‌ విజృంభణ

4 గంటల క్రితం

Ebola virus
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

4వేలు దాటిన మరణాలు
బ్రజవిల్లె : కాంగో రిపబ్లిక్‌‌లో పెచ్చరిల్లిన ఎబొలా వైరస్‌‌తో ఇప్పటివరకు 4వేల మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా చూసేందుకు కాంగో ప్రభుత్వం సతమతమవుతోంది. గురువారం కాంగో ఆరోగ్య శాఖ అధికారులు తాజా గణాంకాలు విడుదల చేశారు. ధ్రువీకరించిన కేసులు 8,300 కాగా, మరణించిన వారి సంఖ్య 4018గా వుంది. అంటే ధృవీకరించిన కేసుల్లో సగానికి సగం చనిపోయారంటే వైరస్‌ ఎంత ఉధృతంగా పెచ్చరిల్లిందో తెలుస్తోంది. మే 15న ఎబోలా వైరస్‌ ‌గురించి కాంగో ప్రకటించింది. ఈ వైరస్‌‌కు ఎలాంటి చికిత్స కానీ వ్యాక్సిన్‌ గానీ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌‌తో ప్రభుత్వం పోరాడుతున్న తీరు, తీసుకుంటున్న చర్యలను కాంగో రాజకీయ నేత ఒకరు సమర్ధించినందుకు ఈ వారం ఆరంభంలో ఆ నేతపై దాడి చేసి కొట్టి చంపేశారంటే ఉద్రిక్తతలు ఎంతలా నెలకొన్నాయో అర్ధమవుతోంది. అలాగే అధికారులు, హెల్త్‌ వర్కర్లు మధ్య పెరుగుతున్న అపనమ్మకం, అపోహల కారణంగా ఎబోలాను అదుపు చేసే ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్