15 బిలియన్ డాలర్ల ప్రాజెక్టును ఆవిష్కరించిన ట్రంప్
వాషింగ్టన్ : మన దేశానికి చెందిన ఎస్సార్ గ్రూప్ అమెరికాలో అతి పెద్ద స్టీల్ ప్లాంటును నిర్మించబోతోంది. పదిహేను బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆవిష్కరించారు. అధ్యక్షభవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సార్ గ్రూప్ అనుబంధ మెసాబీ మెటలిక్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు కూడా హాజరయ్యారు. ఈ పెట్టుబడి అమెరికా తయారీ పరిశ్రమకు ఊతమిస్తుందని ట్రంప్ తెలిపారు. కాగా ఇది అమెరికాలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అవుతుందని శ్వేతసౌధం అభివర్ణించింది. ఎస్సార్ గ్రూప్ అమెరికాలో మొత్తంగా 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. అమెరికాలో తమ ఉత్పత్తులను విస్తరించేందుకు మద్దతు ఇస్తున్న ట్రంప్‌కు ఎస్సార్ గ్రూప్ ఛైర్మన్ రేవంత్ రుయా ధన్యవాదాలు తెలిపారు.
మెసాబీ మెటాలిక్స్ మిన్నెసోటాలోని తన గని నుంచి వెలికితీసిన ఇనుప ఖనిజాన్ని అయోవాకు రవాణా చేసి అక్కడ ఉక్కుగా ప్రాసెస్ చేయాలని యోచి స్తోంది. అయోవా ప్లాంట్ తొలి దశలో ఏడాదికి ఏడున్నర మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ ఉత్పత్తి చివరికి సంవత్సరానికి పది మిలియన్ టన్నులకు పెరగవచ్చు. ఉక్కు ఉత్పత్తి 2030లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. మిన్నెసోటా గని ప్రాముఖ్యతను ట్రంప్ నొక్కి చెబుతూ దీనిని గత ఐదు దశాబ్దాల కాలంలో అమెరికాలో మొట్టమొదటి కొత్త ఇనుప ఖనిజపు గనిగా అభివర్ణించారు. ఈ గని మిన్నెసోటాలోని మొసాబీ ఐరన్ రేంజ్‌లో ఉంది. ఈ శ్రేణి 80-100 మైళ్ల వరకూ విస్తరించి ఉంది. 20వ శతాబ్దంలో అమెరికా ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ఈ గని వాటా సుమారు 60 శాతం.
అమెరికాలో ఎస్సార్ స్టీల్ ప్లాంట్
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)