నవతెలంగాణ -హైదరాబాద్
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన 20వ ఆసియా క్రీడలలో భారత పురుషులలు, మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలను సాధించాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పాల్గొన్న భారత మహిళల కబడ్డీ జట్టులో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు కుమారి రీతూ నేగి, కుమారి పింకీ రాయ్ సభ్యులు ఉన్నారు. భారత మహిళల కబడ్డీ జట్టు కోచ్ అయిన కుమారి నీతా దిద్వే కూడా దక్షిణ మధ్య రైల్వేలోనే పనిచేస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పాల్గొన్న భారత పురుషుల కబడ్డీ జట్టులో సుమిత్ సాంగ్వాన్ , అయన్ లోహ్‌చాబ్ సైతం జట్టులో భాగంగా ఉన్నారు. కుమారి రితు నేగి లాలా గూడలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్ లోని సీనియర్ మెటీరియల్ మేనేజర్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తుండగా, కుమారి పింకీ రాయ్ మెట్టుగూడలోని సిగ్నల్ , టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ లోని చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ కార్యాలయంలో సీనియర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు.
భారత కబడ్డీ జట్టు కోచ్ అయిన కుమారి నీత దిద్వే, ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కార్యాలయంలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ గా విధులను నిర్వర్తిస్తున్నారు. పురుషుల జట్టులో సికింద్రాబాద్‌లోని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కార్యాలయానికి చెందిన ప్రొ . కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయాన్ లోచ్‌బ్, అదే కార్యాలయానికి చెందిన కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సుమిత్ సాంగ్వాన్ సైతం ఉన్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పై దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారులు సాధించిన అద్భుత విజయం దక్షిణ మధ్య రైల్వే భారతీయ రైల్వేలకు ఎంతో గర్వకారణం. క్రీడలను ప్రోత్సహించడంలోనూ మరియు ఉద్యోగులను వారి వారి క్రీడా విభాగాలలో రాణించేలా ప్రోత్సహించడంలోనూ దక్షిణ మధ్య రైల్వే చేస్తున్న నిరంతర కృషి వారి విజయం ద్వారా ప్రతిబింబిస్తుంది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, అద్భుతమైన విజయాన్ని సాధించిన కుమారి రీతూ నేగి, కుమారి పింకీ రాయ్, కుమారి నీతా దిద్వే, సుమిత్ సాంగ్వాన్ , అయాన్ లోచ్‌చాబ్‌లను అభినందించారు. భారత కబడ్డీ జట్లకు వారు అందించిన సేవలను, అలాగే భారతీయ రైల్వేలకు దక్షిణ మధ్య రైల్వేకు వారు తెచ్చిపెట్టిన కీర్తిని ఆయన ప్రశంసించారు. వారి భవిష్యత్తు క్రీడా ప్రయాణంలో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఆసియా క్రీడల్లో రైల్వే క్రీడాకారుల ప్రతిభ
3 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)