Magazines

174 మంది ప్రాణాలను కాపాడిన ధైర్యసాహసాన్ని కొనియాడిన ఎమ్మెల్యే

58 నిమిషాల క్రితం

MLA praises bravery that saved 174 lives
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నాచారం : ఆపద సమయంలో అసాధారణ సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు ప్రదర్శించి 174 మంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన క్యాప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, క్యాప్టెన్ స్మిత్ మచ్చర్ సేవలను ప్రశంసించారు. అనంతరం మల్లాపూర్ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, క్యాప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యం, విధి నిబద్ధత, బాధ్యతాయుతమైన నిర్ణయాలను కొనియాడారు. ఆపద సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మానవ ప్రాణాలను రక్షించేందుకు చేసిన ప్రయత్నం గొప్ప మానవతా సేవగా నిలిచిందన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..“ప్రాణాలను కాపాడేందుకు సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాలు ఎంతో విలువైనవి. క్యాప్టెన్ స్మిత్ మచ్చర్ గారి ధైర్యసాహసం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమైనది. ఆయన చూపిన బాధ్యతాభావం, సేవా తత్వం సమాజానికి స్ఫూర్తినిస్తుంది” అని పేర్కొన్నారు. క్యాప్టెన్ స్మిత్ మచ్చర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో అసాధారణ ధైర్యం ప్రదర్శించిన ఆయనకు మరోసారి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్