Magazines

రెండు స్వర్ణాలతో జాతీయ స్థాయికి కొడవత్ స్వప్న

1 గంట క్రితం

sports
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తిమ్మాజిపేట

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామపంచాయతీ కొడవత్ తండాలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కొడవత్ స్వప్న అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి సత్తా చాటింది. ఆదివారం హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 1500 మీటర్ల పరుగు విభాగంలో 5:04 నిమిషాల టైమింగ్‌తో, 3000 మీటర్ల స్టీపుల్‌చేస్‌లో 11:18 నిమిషాల టైమింగ్‌తో రెండు స్వర్ణ పతకాలు సాధించింది.


ఈ విజయంతో స్వప్న 41వ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఆటో డ్రైవర్ తండ్రి, రోజువారీ కూలీ తల్లి కష్టాలను అధిగమిస్తూ స్వప్న సాధించిన ఈ విజయం ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వప్నకు చిన్ననాటి నుంచి శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తూ ప్రోత్సహించిన ఆమె బాబాయి కొడవత్ రవి పిఇటీ ఎక్స్పర్ట్ అథ్లెటిక్స్ కోచ్, తన ఛాంపియన్‌పై గర్వం వ్యక్తం చేశారు. “రెండు స్వర్ణాలు మా ప్రయాణానికి ముగింపు కాదని…జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలే మా తదుపరి లక్ష్యం లక్ష్మణ్ లక్ష్యమని కొడవత్ స్వప్న నవతెలంగాణకు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్