Magazines

కబడ్డీలో హుస్నాబాద్ జట్టు సత్తా

12 గంటల క్రితం

husnabad
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

- క్రీడాకారులను అభినందించిన జిల్లా గ్రంధాలయల మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన 70వ జిల్లా స్థాయి పాఠశాలల కబడ్డీ పోటీల్లో హుస్నాబాద్ మండలం అండర్ 17 ఏళ్ల బాలుర జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. కబడ్డీ క్రీడలో విజయం సాధించిన జట్టు సభ్యులను జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి శనివారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని శిక్షణ కేంద్రంలో కలిసి అభినందించారు.

రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి సాధన చేసి ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి వసతి, భోజన సౌకర్యాలు కల్పించారని కేడం లింగమూర్తి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధమవుతున్న క్రీడాకారులకు అవసరమైన సూచనలు, ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. జట్టు సభ్యులకు టీషర్టులు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్‌లు కృష్ణ, గద్దల రమేష్, నాయకులు మహెందర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్