Magazines

పంచాయతీ రాజ్ చట్టంపై నిర్లక్ష్యం

7 గంటల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

-దాచారంలో గ్రామ సభ నిర్వహించని వైనం

-గ్రామ సభల వివరాలపై స్పష్టతలేని ఎంపీఓ

నవతెలంగాణ-బెజ్జంకి

అక్టోబర్ 2 భారతదేశ స్వాతంత్య్ర సమరంలో తనదైన శైలిలో పోరాటం చేసి ప్రజల్లో సుస్థిరస్థానం పొందాడు మోహన్ దాస్ ఖరమ్ చంద్ గాంధీ. భారతదేశానికి అత్యత్తమ రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14.వీరిద్దరి జయంతుల సందర్భంగా ప్రతి గ్రామంలో పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ సభలేర్పాటు చేసి ఉపాధి హామీ పథకం,రాజ్యాంగం అవశ్యకతను ప్రజలకు వివరించాలి.కాని ఇందుకు భిన్నంగా మండల పరిధిలోని దాచారం గ్రామం నిలిచింది.


పంచాయతీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి గ్రామ సభ నిర్వహించకపోవడం పంచాయతీ రాజ్ చట్టంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.మండలంలో ఎన్ని గ్రామాల్లో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించారని ఎంపీఓ ఖలీమొద్ధీన్ ను వివరణ కోరగా మండలంలోని 24 గ్రామాల్లో సభలు నిర్వహించారని తెలుపడం..ఓ అధికారిగా విధుల్లో నిర్లక్ష్యానికి తార్కణంగా నిలుస్తోంది.గ్రామ సభ నిర్వహణపై పంచాయతీ కార్యదర్శి సురేశ్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.పంచాయతీ రాజ్ చట్టాన్ని పాటించకుండా..విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీఓ,గ్రామ సభ నిర్వహించుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిపై సంబంధిత జిల్లాధికార యంత్రాంగం స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవశ్యకత ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్