నవతెలంగాణ-ఆలేరు టౌను
ప్రజలను కించపరిచే విధంగా దూషించిన, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఆలేరు పట్టణంలో మంగళవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రైల్వే గేట్ సమీపంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ మాట్లాడుతూ.. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక వర్గం ప్రజలను కించపరచుతూ మాట్లాడడం ఆయన నీచత్వానికి నిదర్శమని తెలిపారు. ఎంతోమంది మనోభావాలను దెబ్బతీస్తూ కులమతాల మధ్య చిచ్చు పెడుతూ ఓటు రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మతసామరస్యాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అల్లర్లు చేసే విధంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఐడియా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిలు ఎలగల వెంకటేష్, అమరేందర్, బందెల సుభాష్, కుమ్మరిండ్ల లక్ష్మి, ఎగ్గిడి సంపత్, బైరి మహేందర్ గౌడ్, సాయి ప్రసాద్ , కొమురయ్య, బందెల విష్ణు రచ్చ రాము తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)