నవతెలంగాణ-ఆలేరు టౌన్
కోతుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు.
ఆలేర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులు, నివాస ప్రాంతాల్లో కోతుల సంచారం అధికమై ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రత మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ,ఆలేర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కోతుల పట్టివేత కార్యక్రమం శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ బీజన బాలమణి బాస్కర్ మాట్లాడుతూ పట్టణంలో కోతులు లేకుండా చూడడమే తమ లక్షమన్నారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, కోతుల పట్టివేత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఆలేర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటి వరకు 350కు పైగా కోతులను పట్టుకున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్, జెట్ట నీరజ సిద్దులు, జుకంటి సంపత్, పురప్రముఖులు మల్లెల శ్రీకాంత్, వనరాసి మార్క్, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)