Magazines

ఎమ్మార్పీఎస్-టి మండల అధ్యక్షుడుగా గుగ్గిళ్ల రాజ్ కుమార్ నియామకం

49 నిమిషాల క్రితం

MRPST-T Mandal President
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ (ఎమ్మార్పీఎస్-టి) వ్యవస్థాపకుడు ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్-టి మండల, తాడిచెర్ల గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా జిల్లా అధ్యక్షుడు బూడిద సమ్మయ్య మాదిగ శనివారం తెలిపారు. మండల అధ్యక్షుడుగా గుగ్గిళ్ల రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడుగా ఇందారపు మొగిలి మాదిగ, ప్రధాన కార్యదర్శిగా బూడిద శ్రావణ్, ప్రచార కార్యదర్శిగా రోడ్డ  సంజీవ్, కార్యదర్శులుగా ఇందారపు రంజిత్, కొలుగోరి  సందీప్, గ్రామ అధ్యక్షుడుగా కొలుగూరి సంపత్, ఉపాధ్యక్షుడుగా తాండ్ర ఆశీర్వాదం, ప్రధాన కార్యదర్శిగా తాండ్ర సదానందం, ప్రచార కార్యదర్శిగా ఇనుగాల సతీష్, కార్యదర్శిగా తాండ్ర కిరణ్ కుమార్, సభ్యులుగా ఇందారపురాజ పోచయ్య, ఇందారపు దినేష్, ఇందారపు విజయ్, ఇందారపు శివాజీ, ఇందారపు రమేష్, తాండ్ర రవి, ఇందారపు ఓదెయ్య ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్-టి బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్