Magazines

తాడిచెర్లలో 132 కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన

6 గంటల క్రితం

sub station
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలో విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిస్కారం చేయాలని గతంలో పలుమార్లు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు,రైతులు రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు దృష్టికి తీసుకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు (పిడిసిఏల్) రాష్ట్ర విద్యుత్ సిఎండి బుధవారం ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి,తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,మండల తహసీల్దార్ రవికుమార్,ఆర్ఐ శ్రీనివాస్, జిపిఓ నరేశ్,వార్డు సభ్యులు,ప్రజలతో కలిసి ప్రభుత్వ భూమిని పరిశీలించారు.విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిస్కారం చేయడానికి త్వరలోనే సబ్ స్టేషన్ నిర్మాణం పనులు చేపట్టునట్లుగా తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్