టి పి టి ఎఫ్ మహబూబాద్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రశ్న పత్రాల బాహ్య మూల్యాంకనం వెనక్కి తీసుకోవాలని టి పి టి ఎఫ్ మహబూబాద్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఆ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో బాధ్యులు యాకయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ పాఠశాలలో రేపటి నుండి జరిగే సమ్మేటివ్ పరీక్ష పత్రాలను మండల కేంద్రాల్లో మూల్యాంకనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల కేవలం మార్కులు, గ్రేడ్ ల వెంట విద్యార్థులను పరుగెత్తే లాగా చేసే చర్య అవుతుందని, ఫలితాలకోసం మాస్ కాపీయింగ్ ప్రోత్సహించే సంస్కృతి పెరిగిందని ఇప్పటికే విద్యావేత్తలు, ప్రజలు అభిప్రాయపడుతున్న సందర్భంలో ఇలాంటి నిర్ణయం ప్రాథమిక స్థాయిలో కూడా అదే రకమైన ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు.
ఇది ఉపాధ్యాయులను కించపరిచే చర్య అని , దీని వల్ల విద్యా వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం లేక పోగా ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతుందని అన్నారు. సబ్జెక్టు టీచర్ అందుబాటులో లేకుండా విద్యార్థి పరీక్ష వ్రాయవలసి పరిస్థితి ఏర్పడుతుంది అని ఈ విధానం వల్ల విద్య అంటే మూల్యాంకనం మాత్రమే అన్నట్టు విద్యాశాఖ ఆలోచించడం సరికాదని అన్నారు. ఇది విద్యా లక్ష్యాలకే విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి విద్యా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు,పద్మావతి,రాజు,నవీన్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)