హెరిటేజ్ జాబితాలో చోటు
ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో
భారత్‌లోని మరో
ఐదు కొత్త ప్రదేశాలు
మొత్తం 78కి చేరిన ఇండియాకు
చెందిన హెరిటేజ్ సైట్స్
న్యూఢిల్లీ : భారతదేశానికి చెందిన ఐదు కొత్త చారిత్రక ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేరాయి. బాగ్ గుహ చిత్రాలు (పెయింటింగ్స్), చంబల్ లోయలోని దేవాలయాల సమూహం, ఉదయగిరి గుహలు, గిన్నోర్‌గఢ్ కోట, భారత్, దక్షిణాఫ్రికా సంయుక్త అంతర్జాతీయ ప్రతిపాదన అయిన మహాత్మ గాంధీ చేపట్టిన సత్యాగ్రహంతో ముడిపడి ఉన్న ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేరిన భారతీయ ప్రదేశాల సంఖ్య 78కి చేరింది.
' మైలురాయిగా నిలిచిపోతుంది." అని పీఐబీ కల్చర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
ఈ ఘనత దేశ గొప్ప వారసత్వానికి మైలురాయిగా
"యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేరిన భారత్‌కు చెందిన ప్రదేశాల సంఖ్య 78కి చేరింది. మధ్యప్రదేశ్‌లోని బాగ్ గుహ పెయింటింగ్స్, చంబల్ లోయలోని దేవాలయాల సమూహం, ఉదయగిరి గుహలు, గిన్నోర్‌గఢ్ కోట ఈ జాబితాలో చేరాయి. భారత్-దక్షిణాఫ్రికా సంయుక్త అంతర్జాతీయ ప్రతిపాదన అయిన మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేపట్టిన ప్రదేశాలు ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. ఈ ఘనత దేశ గొప్ప వారసత్వానికి గర్వించదగిన
బాగ్ గుహ పెయింటింగ్స్
మధ్యప్రదేశ్‌లోని ఉదయగిరి కొండలో ఉన్న బాగ్ గుహ పెయింటింగ్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ పెయింటింగ్స్ గుప్తుల కాలం నాటివి. 4వ శతాబ్దం చివరి నుంచి 5వ శతాబ్దం ప్రారంభం మధ్య అభివృద్ధి చేసిన రాతితో వీటిని చెక్కారు. ఈ ప్రదేశంలో ఇరవై గుహలు, శిలా ఫలకాలు, శాసనాలు, రాకపోకల మార్గాలు, గుర్తులు, శాసనాలు ఉన్న రాతి ఉపరితలాలు, ఇంకా వాటికి సంబంధించిన భౌగోళిక, జల సంబంధమైనవి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక సమగ్రమైన సంప్రదాయ భూభాగాన్ని ఏర్పరుస్తాయి. బాగ్ గుహలు అనేవి పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని బాఘ్ని నది ఒడ్డున, వింధ్య పర్వత శ్రేణి దక్షిణ వాలుపై ఉన్న రాతితో చెక్కిన బౌద్ధ గుహల సమూహం. బసాల్ట్ శిలలతో కూడిన ఈ ప్రాంతంలో ఇసుక రాయితో ఏర్పడింది ఈ గుహలే. ఈ అంశం వాటి నిర్మాణ రూపాలను, కుడ్య చిత్రాల పరిరక్షణను గణనీయంగా ప్రభావితం చేసింది. అందుకే బాగ్ గుహ పెయింటింగ్స్ ప్రపంచ ఖ్యాతిని గడించాయి.
గిన్నోర్‌గఢ్ కోట
గిన్నోర్‌గఢ్ కోట అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు సమీపంలో ఉన్న ఒక చారిత్రక కోట. దీన్ని రతపాని టైగర్ రిజర్వ్ మధ్యలో సుమారు 700 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక రాతి శిఖరంపై నిర్మించారు. భారతదేశానికి చెందిన ప్రసిద్ధ గిరిజన పాలకుల (గోండులు) వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ కోటను తాజాగా యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. కాగా, ఒక ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ హోదా కోసం పరిగణనలోకి తీసుకోవాలంటే అది ముందుగా యునెస్కో తాత్కాలిక జాబితాలో గుర్తింపు పొందాలి. మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమ చారిత్రక మార్గానికి సంబంధించిన ట్రాన్స్‌నేషనల్ (అంతర్జాతీయ) ఉమ్మడి ప్రతిపాదనకు యునెస్కో ఆమోదం తెలిపింది. మహాత్మ గాంధీ చేపట్టిన సత్యాగ్రహంతో ముడిపడి ఉన్న ప్రదేశాలకు యునెస్కో గుర్తింపును ఇచ్చింది. ఈ ప్రతిపాదిత ప్రాపర్టీలో మొత్తం తొమ్మిది భాగాలు ఉంటాయి. వాటిలో రెండు దక్షిణాఫ్రికాలో (గాంధీ 1893-1914 వరకు గడిపిన 21 సంవత్సరాలు), ఏడు భారత్‌లో (గాంధీ తన జీవితంలో ఎక్కువ భాగం గడిపారు) ఉన్నాయి.
ఆ తొమ్మిది భాగాలు
దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్, ఫీనిక్స్ సెటిల్‌మెంట్, భారతదేశంలోని మహాత్మా గాంధీ సత్యాగ్రహ స్మారక్, సబర్మతి ఆశ్రమం, మణి భవన్ కాంప్లెక్స్, హరిజన్ సేవక్ సంఘ్ కాంప్లెక్స్, సేవాగ్రామ్ ఆశ్రమం, ఆగాఖాన్ ప్యాలెస్, గాంధీ స్మృతి నివాసం. ఈ తొమ్మిది అంశాలు సత్యాగ్రహం పరిణామాన్ని సూచిస్తాయి. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన రూపంగా (పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్) ప్రారంభమైన ఈ ఉద్యమం సత్యం, అహింసతో ముందుకు సాగింది.
భారత్‌లోని ఐదు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)