Magazines

నీకు నువ్వు కూడదీసుకో...

1 గంట క్రితం

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

దూరం నుండి చూస్తే దగ్గరకు చేరదేదీ మనసు రెక్కలు తొడిగి ఎగరడం నేర్చుకుంటే దూరం ఉండదేదీ తోడు కోసం చూసీ చూసి మొదట్లోనే ఆగిపోకు ఒంటరిగా మొదలెట్టాకే నదిగా మారిన వాన చినుకైనా నీకు గుర్తుకు రావాలి సాఫీగా సాగిపోతున్న నడక నీది కాదెప్పటికీ కాలం ముడుకుల్లో ముసలం మొదలైనప్పుడు గాలివాటంగానైనా జారిన ప్రతి అడుగూ నీదే ముందుకెళ్తున్నప్పుడు వెనక్కి లాగుతారెవరో అప్పుడప్పుడైనా, రెండడుగులు వెనక్కి వెయ్యు వెనక్కి వెళ్లే సామర్థ్యం లేని ఏ వాహనమూ దూర ప్రయాణం సాగించలేదు నడిచిన తోవెప్పుడూ గుర్తెట్టుకో కాళ్ళ కింద మట్టి వదులైనప్పుడు జారిపడ్డ గోతిలో నిన్ను ఎత్తేవారే ఉండరు నీకు నువ్వుగానే మళ్ళీ పైకి రావాలి ప్రయాణం మధ్యలో ఆపెయ్యకేదీ ఎదురీదడంలోనే ఉంది అసలైన మజా భూమిలో కలిసిపోయిన నదీ మార్గం మళ్ళీ, పెద్ద ముసురు వానకే పురుడు పోసుకుంటుంది తగిలిన గాయాలకు లేపనమొక్కటే సరిపోదు నడక నీదైనట్టే, నీ గాయాలనూ నువ్వే దిగమింగుకోవాలి పడిపోతున్న ప్రతిసారీ నీకు నువ్వు కూడదీసుకోవడమే నీ విజయ రహస్యం

వినోద్‌ కుత్తుం, 9634314502

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్