రథయాత్ర జెండా లాక్కునేందుకు
బీజేపీ నాయకుల యత్నం
స్వల్ప తోపులాట
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రథం ప్రారంభోత్సవం వేళ హైడ్రామా నడిచింది. సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే రథయాత్ర ప్రారంభ సూచకంగా జెండా ఊపే విషయమై బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరుపై సర్వ్రతా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గణేశ్ నిమజ్జనంలో రథయాత్రకు ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులు, పోలీసు ముఖ్య అధికారులు వచ్చి గౌరవ సూచకంగా జెండాను ఊపి ప్రారంభించడం ఆనవాయితీ. కాగా శుక్రవారం సైతం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మమహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు హాజరు కాగా, బీజేపీ నుంచి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్, నాయకులు, అనుచరులు వచ్చారు. మండలి అధ్యక్షులు బంటు రాము జెండా ఊపి రథయాత్రను ప్రారంభించాల్సి ఉండగా.. పలువురు బీజేపీ నాయకులు జెండాను లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో పోటీగా కాంగ్రెస్ నాయకులు సైతం జెండాను తీసుకునేందుకు ప్రయత్నించగా.. స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
శోభాయత్ర వేళ బాహాబాహీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)