కొండాపూర్, నాగోల్ ట్రాక్‌ల తనిఖీ
పరీక్షా ప్రక్రియలో మానవజోక్యాన్ని తగ్గిస్తాం : జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రోడ్డు ప్రమాదాలను తగ్గించి రహదారి భద్రతను పెంపొందించాలంటే డ్రైవింగ్ పరీక్షలు కఠినంగా, పారదర్శకంగా జరగాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. పరీక్షా ప్రక్రియలో మానవ జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉపరవాణా కమిషనర్ రవీందర్ కుమార్, ఆర్టీఓ రఘునందన్ , హెచ్ఎండీఏ అధికారులతో కలిసి జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్‌తో కొండాపూర్,నాగోల్ డ్రైవంగ్ టెస్ట్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఇటీవల ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల కమిటీ సభ్యులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను సందర్శించి అక్కడ అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించారని వివరించారు. ఆ నివేదిక ఆధారంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ , రవాణా కమిషనర్ ఇలంబరితి ఆదేశాల మేరకు మొదటి దశలో కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని ఐదు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లతో పాటు కరీంనగర్ ఆర్టీఓ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను ఆధునీకరించి, ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ విధానంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ ప్రణాళిక రూపొందిస్తున్నదని తెలిపారు. రవాణా శాఖ, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా ప్రస్తుత డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఆధునీకరించి, ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ ద్వారా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ అధికారులు శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, విక్రమ్, ఆర్కిటెక్ట్ ఆకాష్ రెడ్డి, కమిటీ సభ్యులు అమృత వర్షిణి, అభిలాష్ నాయక్, నేహా, ఆర్టీవో కొండయ్యతో కలిసి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించినట్టు వెల్లడించారు.సందర్శించారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ పరీక్షలు జరుగుతున్న విధానం, తేవాల్సిన మార్పులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్‌తో డ్రైవింగ్ టెస్ట్
50 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)