Magazines

ఖైరతాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్ ఖాళీ

1 గంట క్రితం

Khairatabad Assembly segment vacant.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

సర్కారు గెజిట్‌ నోటిఫికేషన్‌
దానం నాగేందర్‌‌పై అనర్హత వేటు హైకోర్టు తీర్పు అమల్లోకి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయిన ట్టుగా రాష్ట ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీచేసిం ది. ఈ మేరకు ఈనెల 26నే అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఉత్తర్వులు ఇచ్చారు. తద్వా రా దానం నాగేందర్‌ పై అనర్హత వేటు పడింది. తెలంగాణ హైకోర్టు తీర్పు అమల్లోకి వచ్చింది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న ఆయన్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌‌సభ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిరాయింపు పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు 2024 ఏప్రిల్ 23 నుంచే ఫిరాయింపుల చట్టం ప్రకారం ఎమ్మెల్యేగా అనర్హుడని తీర్పు ఇచ్చింది. ఈతీర్పుపై ఇటీవల నాగేందర్‌ ‌సుప్రీంకోర్టులో అప్పీల్‌ ‌చేశారు. అక్కడా నిరాశే ఎదురైంది. హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. 2024 ఏప్రిల్ 23 తేదీ నుంచే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా పరిగణించాలని తీర్పులో పేర్కొన్నది. ఈనేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్